ఎవ‌రు ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… అడివి శేష్ స‌క్సెస్‌

యంగ్ హీరో అడ‌వి శేష్ న‌టించిన ఎవ‌రు సినిమా ఇండిపెండెన్స్ డే కానుక‌గా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క్రైం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల నుంచి కూడా మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. సినిమా ప్రారంభం నుండి చివ‌రి సీన్ వ‌ర‌కు ఉండే ట్విస్టులు… ప్ర‌తి స‌న్నివేశాన్ని ఒక‌దానికొక‌టి ముడిపెడుతూ.. అస‌లుహంత‌కుడు ఎవ‌రా? అనేది చివ‌రి వ‌ర‌కు తెలియ‌కుండా సినిమా ముందుకు న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.

Evaru Movie First Day collections
Evaru Movie First Day collections

ఇక సినిమాను ముందు నుంచి బాగా ప్ర‌మోట్ చేయ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. అటు శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం పోటీలో ఉన్నా కూడా ఎవ‌రు తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1.7 కోట్ల షేర్‌ సాధించింది. ఈ సినిమాకు మొత్తం రూ.7 కోట్ల‌కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇక గూడ‌చారి సినిమాతో హిట్ కొట్టిన అడ‌వి శేష్ ఇప్పుడు ఎవ‌రు సినిమాతో ఈ యేడాది మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఎవ‌రుతో అడివిశేష్ హీరోగా నెక్స్‌ట్ లెవ‌ల్‌కు రీచ్ అయ్యాడు. న‌వీన్ చంద్ర‌, రెజీనా క‌సండ్ర పాత్ర‌లు సినిమాకు మెయిన్ పిల్ల‌ర్‌గా నిలిచాయి. అలాగే ముర‌ళీశ‌ర్మ‌, ప‌విత్రా లోకేష్‌లు పాత్ర‌లు ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. ఎవ‌రుతో అడ‌వి శేష్ మార్కెట్ కూడా పెర‌గ‌డంతో మ‌నోడు సెప్టెంబ‌ర్ నుంచి స్టార్ట్ అయ్యే మేజ‌ర్ షూటింగ్‌కు మరింత ఉత్సాహంతో రెడీ అవుతున్నాడు.