హైదరాబాద్ ప్రజలకి మెట్రో గుడ్ న్యూస్…!!!

1959

హైదరాబాద్ ప్రజలకి మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మెట్రో ట్రైన్ కోసం కేవలం మూడు నిమిషాల సమయం మాత్రం వేచి ఉండండి చాలని హామీ ఇచ్చింది. ప్రతీ మూడు నిమిషాలకి ఒక సారి మెట్రో రైలు అందుబాటులోకి రానుందని ప్రకటించింది.

hyderabad metro says good news

జూబ్లీ చెక్ పోస్ట్ హైటెక్ సిటీ మార్గంలో రివర్సల్ సదుపాయం లేకపోవడంతో గతంలో 8 నిమిషాలకి ఓ మెట్రో వచ్చేది. కానీ ఇప్పుడు రివర్సల్ సదుపాయం రావడంతో మూడు మరియు 5 నిమిషాలలో అందుబాటులోకి రానున్నాయని మెట్రో తెలిపింది.

ఇదిలా ఉంటే మెట్రో సర్వీసులకు గ్రేటర్ సిటిజన్ల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. వారానికి సుమారు మెట్రో రైలులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 5 నుంచి 6 వేల వరకు పెరుగుతోందని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా గత వారం మెట్రో ప్రయాణీకుల సంఖ్య 3.06 లక్షలకు చేరుకోవడంతో మెట్రో వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఎల్బీ నగర్ – మియాపూర్ , నాగోల్ – హైటెక్ సిటీ మార్గాలలో మెట్రో పరుగులు పెడుతోంది. రోజు రోజుకి ఏరియాల వారీగా మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇదిలాఉంటే
హైటెక్ సిటీ రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ మార్గంలో మెట్రో పట్టాలు సిగ్నలింగ్ టెలికమ్యూనికేషన్ స్టేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరులోనే ఈ మార్గం గుండా మెట్రో ట్రయల్ రన్ నిర్వహిస్తామని మెట్రో వర్గాలు తెలిపాయి.

హైటెక్‌ సిటీ–రాయదుర్గం మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ (1.1 కి.మీ.) మార్గంలో మెట్రో పట్టాలు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, స్టేషన్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరులో ఈ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని హెచ్ఎంఆర్‌ వర్గాలు తెలిపాయి.