ఆర్.జే గా ప్రయాణం మొదలు పెట్టిన ప్రదీప్ మాచిరాజు ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఒక మేల్ యాంకర్ గా ప్రస్తుతం ఉన్న హెవీ కాంపిటీషన్ లో ఇంతటి అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకోవడం అంటే అంత ఆషా మాషి విషయం కాదు. కాని ప్రదీప్ అది సాధించాడు. ఒక కొత్త షో మొదలవుతుందంటే ఖచ్చితంగా ప్రదీప్ పేరు ప్రస్తావనకి రావాల్సిందే. అంతగా ఆకట్టుకుంటున్నాడు.
ఇక నిర్మాతగాను సొంతగా షోలు నిర్మిస్తూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా తన లక్ ని చెక్ చేసుకుంటున్నాడు ప్రదీప్ మాచి రాజు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి టైటిట్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిత్రానికి సంబంధిచిన పోస్టర్ రానా విడుదల చేయగా.. ఈ సినిమాలోని తొలి పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలోని రెండు లిరికల్ పాటలు మిల్క్ బ్యూటీ తమన్నా విడుదల చేశారు.
ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరో సాంగ్ స్నేహం చెబుతూ సాగే “ఇదేరా స్నేహం.. కనివిని ఎరుగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం.. దేహం అడగని స్నేహం..’అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ యూత్ ను ఆకట్టుకుంటుంది. ఈ పాటను అలవైకుంఠపురంలో ‘బుట్టబొమ్మ’ ఫేమ్ అర్మాన్ మాలిక్ పాడగా చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇంతటి స్టార్స్ వెనకుండి ఈ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నపటికి కరోనా మాత్రం ఈ సినిమా రిలీజ్ కాకుండా ప్రదీప్ ని ఇబ్బంది పెడుతుంది. ఏదేమైనా ఈ సినిమా హిట్ అవడం పక్కా అంటూ ప్రదీప్ అండ్ కో చాలా ధీమాగా ఉన్నారట. ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తున్నారట.