డబ్బుకోసం అవి చెయ్యలేదు.. తమన్నా

-

లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ కి బాగా కలిసొచ్చింది. ఎప్పుడూ షూటింగ్స్.. ఓపెనింగ్స్.. ఫోటోషూట్స్ తో బిజి బిజీగా గడిపే సినిమా సెలబ్రిటీస్ హ్యాపీగా దాదాపు రెండు నెలలపాటు తమ ఫ్యామిలీస్ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత కాలం మిస్సయిన సమయాన్ని ఈ విధంగా ఉపయోగించుకొని ఏమేమి చేయాలనుకొని చేయకుండా ఉండి పోయారో అవన్ని ఈ గ్యాప్ లో చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా దొరికిన సమయాన్ని చక్కగా ఉపయోకుంటుంది. అంతేగాక సోషల్ మీడియా ద్వారా తన ఫిట్నెస్ వీడియోస్.. లటెస్ట్ ఫోటోషూట్స్ ని తన ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. అంతేకాదు… మద్య మద్యలో లైవ్ కి వచ్చి అభిమానులతో సరదాగా గడుపుతోంది. ఈ సందర్భంగా చాలా విషయాలను తెలుసుకుంటుంది.

ఈ నేపథ్యంలో తమన్నా.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా సరదాగా సమాధానం ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేయడం గురించి బయట కొంతమంది తన గురించి ఎలా మాట్లాడుకుంటారన్న విషయాన్ని ఓపెన్ అయింది. నేను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. డబ్బు కోసమే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని అంటున్నారు. అలాంటి వారి మాటలు నేను పట్టించుకోను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నా డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే అవకాశం వాటి వల్ల కలుగుతోంది. అందుకే నేను స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని తమన్నా క్లారిటీ ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version