అత్తారింటికి రికార్డులకు ఎసరు పెడుతున్న ఎఫ్-2..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది. రిలీజ్ ముందే ఫస్ట్ హాఫ్ మొత్తం లీకైన ఈ సినిమా ఆ లీకుల ఎఫెక్ట్ సినిమా మీద ఏమాత్రం పడకుండా సంచలన విజయం అందుకుంది. 80 కోట్ల కలక్షన్స్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన అత్తారింటికి దారేది సినిమా రికార్డులకు ఎసరు పెట్టనున్నారు వెంకటేష్, వరుణ్ తేజ్. ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2.

అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది. ఎఫ్-2 సినిమా 17వ రోజు కూడా 3 కోట్ల షేర్ రాబట్టింది. ప్రస్తుతం 17 రోజుల వరల్డ్ వైడ్ కలక్షన్స్ చూస్తే దాదాపు 72 కోట్ల పైగా రాబట్టింది. లాస్ట్ ఫ్రై డే వచ్చిన అఖిల్ మిస్టర్ మజ్ను కూడా పెద్దగా ప్రభావితం చూపించలేదు. అందుకే ఎఫ్-2 సినిమా వసూళ్లు అదరగొడుతున్నాయి. ఫుల్ రన్ లో అత్తారింటికి దారేది సినిమా రికార్డులు బద్ధలు కొట్టడం గ్యారెంటీ అనేలా ఉన్న ఎఫ్-2 ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news