పాతికేళ్లనాటి సినిమాకు కాపీగా ఎఫ్-2..!

-

విక్టరీ వెంకటేష్, మెగా హీరో కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. హ్యాట్రిక్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తుంది. ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఈ సంక్రాంతికి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కథ చూచాయగా చెప్పాడు దర్శకుడు. పెళ్లికి ముందు పులిగా ఉన్న హీరోలు కాస్త పెళ్లి తర్వాత పిల్లిగా మారుతారు. వెంకటేష్ తన అనుభవాలను చెప్పినా వినకుండా వరుణ్ తేజ్ కూడా కష్టాల్లో పడతాడు. ఇదే ఎఫ్-2 కథ. అయితే ఈ కథ అటు ఇటుగా పాతికేళ్ల క్రిందట వచ్చిన ఇంట్లో పిల్లి వీధిలో పులి సినిమాకు దగ్గరగా ఉంది.

చంద్ర మోహన్, సురేష్ కలిసి చేసిన ఆ సినిమా అప్పట్లో హిట్ అయ్యింది. పి.ఎస్ రామచంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో కూడా కథ అలానే ఉంటుంది. మరి అనీల్ ఆ సినిమా చూసి ఈ కథ రాసుకున్నాడా లేక అలా కుదిరిందో తెలియదు కాని ఎఫ్-2 సినిమా 1991లో వచ్చిన ఆ సినిమాకు 2019 లో వస్తున్న ఎఫ్-2కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మరి కాపీ కామెంట్స్ పై దర్శకుడు అనీల్ రావిపుడి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version