F3 టీమ్‌తో బ్రహ్మానందం..ఇక నవ్వులే నవ్వులు

-

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 3’ ఫిల్మ్ సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా నిలవడమే కాదు..జనాలను హాయిగా నవ్విస్తోంది. సమ్మర్ సోగ్గాళ్లు అయిన విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రజలను థియేటర్లలో కడుపుబ్బ నవ్వి్స్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీ యూనిట్ సభ్యులను స్పెషల్ గా పద్మశ్రీ బ్రహ్మానందం ఇంటర్వ్యూ చేశారు.

ఈ విషయాన్ని ఎఫ్ 3 టీమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ ఇంటర్వ్యూ ప్రోమోలోనే బ్రహ్మానందం నవ్వులు పూయించారు. ఇక ఫుల్ వీడియోలో ఇంకెన్ని హాస్యపు మాటలున్నాయో మరి..డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్, అలీ లను బ్రహ్మానందం ఇంటర్వ్యూ చేశారు.

చిత్ర విశేషాలతో పాటు కామెడీ సన్నివేశాలకు సంబంధించి బ్రహ్మానందం పలు ప్రశ్నలను వీరిని అడిగారు. తన మేనరిజమ్స్ తో బ్రహ్మానందం తెలుగు ప్రేక్షకులను ఎంతగా నవ్వించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఇంటర్వ్యూలో అలానే తన మేనరిజమ్స్ తో అలరిస్తూనే..మూవీ యూనిట్ సభ్యులను అభినందించారు. అయితే, ఈ చిత్రంలో బ్రహ్మానందం నటించలేదు. అయినప్పటికీ ఈ మూవీ టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news