పెళ్లి కష్టాలతో.. నవ్వులు-పువ్వులు పూయిస్తున్న అంటే సుందరానికి ట్రైలర్..!!

-

నాచురల్ స్టార్ నాని సరికొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బ్రాహ్మణ కుర్రాడిగా.. అంటే సుందరానికి అనే సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా అంటే సుందరానికి మూవీ ట్రైలర్ వచ్చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఎప్పుడూ కూడా సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే నాని ఈసారి కూడా విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను బాగా అలరించడమే కాకుండా నజ్రియా నాని పెళ్లి కోసం పడే కష్టాలు.. ప్రేక్షకులకు నవ్వులు పువ్వులు పూయిస్తున్నాయి.

ఇక ట్రైలర్ లో నాని తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు అని చెప్పవచ్చు. నజ్రియా – నాని మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. నాని తండ్రిగా సీనియర్ నటుడు నరేష్ తన క్యారెక్టర్ లో పూర్తిగా వదిలిపోయారు.. ఇకపోతే మీ ఇంట్లో పెళ్ళికి ఓకేనా అంటే.. ఐ విల్ బి కీర్తి శేష్.. చిన్న కళ్ళతో పెద్ద చూపు చూడాలి కానీ .. పెద్ద కళ్ళతో చిన్న చూపు చూడకూడదు.. వంటి డైలాగ్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ముఖ్యంగా బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.Ante Sundharaniki | Telugu Movies | Casts | Trailer | Stills | Rating | Review

ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ లవ్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్ తో పాటు రోహిణి, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, నదియా, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించడం జరిగింది. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్లీ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమా జూన్ 10 వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news