‘ఆచార్య’ ఎఫెక్ట్..తర్వాత సినిమాలపై చిరంజీవి ఫోకస్!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం గత నెల 29న విడుదలైంది. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న అంచనాలను అయితే అందుకోలేకపోయింది. ఫస్ట్ షో నుంచి ఈ పిక్చర్ గురించి డివైడ్ టాక్ వచ్చింది. అలా దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబో బాక్సాఫీసు వద్ద సరైన స్థాయిలో ప్రభంజనం సృష్టించలేకపోయింది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరు..తన నెక్స్ట్ మూవీస్ పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు టాక్. ఫ్యాన్స్ ను అలరించేందుకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ పైన తప్పనిసరిగా ఫోకస్ చేయాలని దర్శకులకు సూచించినట్లు వినికిడి. అయితే, ఈ సారి అలా ఉండబోదని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారట.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ..ఒరిజినల్ స్టోరి శివదే. కాగా, నెక్స్ట్ మూవీస్ రీమేక్స్. ఆల్రెడీ ఒక భాషలో సూపర్ హిట్ అయిన ఆ స్టోరిలను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చి ఎగ్జిక్యూట్ చేయడం ఈజీయేనని మేకర్స్ భావిస్తున్నారట.

‘గాడ్ ఫాదర్, భోళా శంకర్’ రెండు సినిమాలు రీమేక్సే కాగా, ‘వాల్తేరు వీరయ్య’ పిక్చర్ స్టోరి మాత్రం బాబీది. ‘ఆచార్య’ తర్వాత ప్రేక్షకుల ముందకు వచ్చే సినిమా ‘గాడ్ ఫాదర్’ అని మేకర్స్ ఇప్పటికే క్లారిటీనిచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news