‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ టీజర్.. నవ్వకుండా మీరు ఉండలేరు..!

-

ఓ మంచి ప్రయత్నంగా చేసే చిన్న సినిమా టీజర్, ట్రైలర్ తోనే ఆడియెన్స్ లో ఓ క్యూరియాసిటీ పెంచాలి. అయితే ఈమధ్య చిన్న సినిమాల్లో బూతు బాగోతం ఎక్కువవుతుంది. అయితే చిన్న సినిమాల్లో కూడా క్లీన్ ఎంటర్టైనర్ సినిమాలు వస్తాయని చెప్పేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటి ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా.

చేతన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను నరేష్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్ ఆద్యంతన్ ఆసక్తిగా ఉంది. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ ఎవరో కొత్తవాళ్లే అయినా ప్రకాశ్ రాజ్, రావు రమేష్, సీనియర్ నరేష్, బ్రహ్మానందం ఇలా ప్యాడింగ్ యాక్టర్స్ ను బాగా వాడుకున్నారు. మరి ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్ ఆకట్టుకోగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news