ఒక అసమర్థుడి ఎన్నికల యాత్ర

-

ఎన్నికల సభలలో నోటికేదొస్తే అదే వాగితే జనాలు వాతపెడతారు. అదేం చిత్రమో.. విచిత్రమో గానీ, ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి మతిస్థిమితంలేని నాయకులు దొరుకుతున్నారు.

బాల్యంతో తృప్తి లేదు..
తల్లిదండ్రులతో తృప్తి లేదు..
యవ్వనంతో తృప్తి లేదు..
సినిమాలతో తృప్తి లేదు..
భార్యలతో తృప్తి లేదు…
డబ్బులతో తృప్తి లేదు..
తుపాకులతో తృప్తి లేదు..
ఎలా.? ఇంకెలా??

ఆ..

రాజకీయాలకెళ్దాం..
రాష్ట్రాన్ని, దేశాన్ని.. వీలైతే.. ఈ ప్రపంచాన్నీ
సర్వదా శతదా..
శతదా.. సహస్రదా..
పాప పంకిలమైన..
కుల మత జాతి కూపములను..
సమూలముగా.. శాశ్వతముగా..
ప్రక్షాళన గావించెదా…

అ.. అదీ..

అట్టా నవ్వేసేసి పారిపోమాకండి..
ఎవడి డప్పు వారుకొట్టండహే..

ఆ.. అదీ.. ఈ పాటికే అర్థమై ఉంటుందిగా.. ఇదంతా ఎవరి గురించో..
ఇంకా పవర్లోకి రాని స్టార్ గురించి. మీకు తెలిసిన ఒక అసమర్థుడి జీవనయాత్ర ఇది.

నిజమే.. ఆయన చాలా పుస్తకాలు చదివి ఉండొచ్చు.. త్రివిక్రం రాసినవీ, వెంకటేశ్ పంపినవీ, మార్క్స్‌ను, లెనిన్‌ను, భగవద్గీతను, ఖురాన్‌ను, బైబిల్‌ను.. ఇంకా ముఖ్యంగా చేగువేరాను బాగా చదివాడు…. నమిలాడు.. తిన్నాడు.. పీల్చాడు… పూసుకున్నాడు. నషాళానికెక్కింది కూడా. జీవితం విలువలు తెలుసుకున్నానన్నాడు. తన విలువేంటో మాత్రం తనకి తెలియదు. ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసన్నాడు. తనెక్కడ మొదలయ్యాడో తనకి ఇంకా తెలియదు.
ఎదీ స్పష్టతా?
నీ దర్శనం.. ఇది నిదర్శనం.
ఇంతకీ..

ఎవడే.. పవన్‌కళ్యాణ్‌.?

అంజనాదేవి చిన్నకొడుకు.. కాదా..
చిరంజీవి చిన్నతమ్ముడు.. కాదా..
నాగబాబుకి ఏకైక తమ్ముడు.. కాదా…
నందినికి… సారీ.. రేణూదేశాయికి… సారీ.. ఆ.. గుర్తొచ్చింది..అన్నాలెజినోవాకి మొగుడు.. కాదా..
త్రివిక్రమ్‌కు ఆప్తమిత్రుడు.. ఇదీ కాదా.. మరి ఇంతకీ..

ఎవడే.. పవన్‌కళ్యాణ్‌.?

తెలియదు.. ఎవరికీ తెలియదు.. తనకే తెలియదు. ఇక తెలిసే అవకాశమే లేదు. రాదు. ఆ దాఖలాలే కనిపించడంలేదు. తనకేంకావాలో తెలియనివాడు ఇక జనాలకేమిస్తాడు.? జనాల కోసం ఏం చేస్తాడు.

ఎన్నికల సభలలో నోటికేదొస్తే అదే వాగితే జనాలు వాతపెడతారు. ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబోలు. కొన్నిరోజులాగితే అన్నీ అర్థమవుతాయి.
ఇంటర్లో నేను ఎంపిసీ అంటాడు. ఎంఈసీ అంటాడు. సీఈసీ అంటాడు. కానిస్టేబుల్ కొడుకునంటాడు.. పరమ అసహ్య, అసహజ, అసందర్భ ప్రేలాపనలతో రాష్ట్రాటన చేస్తున్నాడు. అదేం చిత్రమో.. విచిత్రమో గానీ, ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి మతిస్థిమితంలేని నాయకులు దొరుకుతున్నారు. అన్నట్లు అక్కడో గీతాచార్యులు కూడా ఉన్నారు. అంతా నేనే అంటాడు. చేసేదీ నేనే, చేయించేదీ నేనే.. మీరంతా నిమిత్తమాత్రులు.. సకల చరాచరసృష్టికి మూలకర్తను నేనే.. హైదరాబాద్‌ను నేనే, మైక్రోసాఫ్ట్‌ను నేనే.. మీచేతుల్లో ఇప్పుడు ఉన్నది నాదే.. కాసేపటి తర్వాత ఉండేది కూడా నాదే.. ఇంతకుముందు ఎర్రగడ్డ నాదే.. ఇప్పుడు విశాఖపట్నం కూడా నాదే అని అంటున్నాడు. పాపం.. వదిలేయకండ్రా వాళ్లనలా.. ఎవరికైనా చూపించండ్రా..!

కేసీఆర్ ఏం చేశాడు.? ఎలక్షన్లు తెలంగాణలో కాదు కదా.! మాటకుముందో కేసీఆర్.. మాటకు వెనుకో కేసీఆర్. ఈ నిత్యకళ్యాణకుమారుడు, ‘కేసీఆర్.. నీకో దండం.. ఆంధ్రను వదిలేయండి’అంటే అంతా షాక్



ఎందుకిలా.?

ఈ నిత్యకళ్యాణకుమారుడు, ‘కేసీఆర్.. నీకో దండం.. ఆంధ్రను వదిలేయండి’అంటే అంతా షాక్ అవ్వరా మరి.
ఎవరు ఎవర్ని పట్టుకుని వేలాడుతున్నారు.? ఎవరు ఎవర్ని తిడుతున్నారు.? ఒక్కసారి సంక్రాంతికి హైదరాబాద్ వస్తే, తెలుస్తుంది ఎవరు ఎవర్ని వదిలేయాలో.. విద్వేషాలు ప్రజలమధ్య ఉండొద్దన్నవాడు.. కేసీఆర్ విషం చిమ్ముతున్నాడని ఎలా అన్నాడు.? రాష్ట్రాల్లా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసుందాం.. అన్నది కేసీఆర్‌. ఆంధ్ర తుఫాన్లలో కొట్టుకుపోతుంటే చేతికి ఎముకలేకుండా సాయం చేసింది కేసీఆర్‌. రాజధానిలో లక్షలాది ఆంధ్రకుటుంబాలు హాయిగా బతుకుతున్నాయంటే కారణం.. కేసీఆర్‌. ఆయనన్నట్లు ఈయన విషమే చిమ్మితే, ముప్పావు హైదరాబాద్ ఖాళీ అయ్యేది. నిజానికి కేసీఆర్‌కు చెడు చేసేంత కాదు ఊహించే అంత తీరిక కూడా లేదు. ఆయనతో ఒక సమీక్షలో కూర్చుంటే తెలుస్తుంది.. ప్రజలకోసం ఒక నాయకుడు పడాల్సిన తపన. పడుతున్న శ్రమ తెలుస్తుంది.

పనీపాటాలేని బేవార్స్‌ సేనల్ని తోలుకుంటూ, అవాకులుచెవాకులు పేలేవాడికేం తెలుస్తుంది.? తెలంగాణ ఉద్యమంలో ఎంత ‘కొంచెం’ హింస జరిగిందో చూపిస్తాడా ఈయన? ప్రపంచలోనే అత్యంత శాంతియుత ఉద్యమంగా పేరెన్నికగన్నది తెలంగాణ ఉద్యమం. ఈయనకు ఇష్టమని చెప్పుకుంటున్న చేగువేరా బాటలోనే గనుక నడిచుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఒక అణుయుద్ధం జరిగుండేది.

అక్కడెక్కడో అమెరికాలో చెత్త సినిమాలకు కూడా ఓరకమైన ఆస్కార్ ఇస్తారట. వాళ్లు ఈయన సినిమాలు చూడకగానీ, లేకపోతే, ఉత్తమ చెత్త నటుడు అవార్డు ప్రతీ సంవత్సరం ఏకగ్రీవంగా ఈయనకే ఇచ్చేవారు. చిరంజీవి అనబడే మేరుపర్వతం లేకపోతే, ఈయన ఎక్కడుండేవాడు.? కరుణాకరన్ అనే దర్శకుడు లేకపోతే ఈయన పరిస్థితి ఏంటి? ఒక్కటంటే ఒక్కటి.. ఈయనగారి నటనావైదుష్యంతో నడిచిన సినిమా.. ఏదీ? ఉండదు.

అన్నగారి అండ, దర్శకుల దండలతో పరాన్నజీవిగా బతికినవాడికి, మెతుకు విలువెలా తెలుస్తుంది.? రాబోయే ఎన్నికలలో వచ్చే ఫలితాలు ఆయన ఆఖరు సినిమాపేరులాగా శేషజీవితాన్ని చూపించబోతున్నాయి.

ప్రియమిత్రుడు త్రివిక్రం మాటల్లోనే చెప్పాలంటే..
చూడప్పా పవనాలు..
ప్రజా రుతుపవనాల ముందు.. ప్రజాభిష్ట విలయతాండవం ముందు..
శిఖరం కూడా తలవంచి తీరుతుంది..
కెరటం కూడా అలిసిపోయి ఆగుతుంది..
అజ్ఞాతం.. ఇక నీ చివరి చరణం అని తెలుసుకో.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news