కెరీర్ లో తొలిసారి అటువంటి కాన్సెప్ట్ తో రాబోతున్న మాస్ రాజా రవితేజ…..!!

-

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. పాయల్ రాజ్ పుత్ మరియు నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల వరుసగా అపజయాలు అందుకుంటున్న రవితేజ, ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ సాధించాలని ఎంతో కసితో పని చేస్తున్నారు.

కాగా ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తాను తీసిన ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల మాదిరిగానే ఈ సినిమా కథ కూడా ఒక వెరైటీ కాన్సెప్ట్ తో సాగుతుందని, అయితే మాస్ మహారాజ రవితేజ మార్క్ సీన్స్ మరియు కామెడీ మాత్రం ఈ సినిమాలో మిస్ కాదని అంటున్నారు దర్శకుడు ఆనంద్. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని ఈనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్.

కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే ‘నువ్వు నాతో ఏమన్నావో’ అంటూ సాగె మెలోడియస్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయగా, శ్రోతలను ఆ సాంగ్ విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమా పై మంచి అంచనాలు కూడా క్రియేట్ చేసింది. మరి ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్న మాస్ రాజాకు ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2020 జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version