2019 లో ఫ్లాప్ సినిమాలు ఏవంటే…..??

-

మరొక పది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. ఇక గడిచిన ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవేవో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అన్న ఎన్టీఆర్ గారి బయోపిక్ సినిమాలుగా జనవరిలో వచ్చిన కథానాయకుడు, అలానే ఫిబ్రవరిలో వచ్చిన మహానాయకుడు సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక చతికిలబడ్డాయి. కాగా అదే నెలలో రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పేట సినిమా కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ ని అందుకోలేకపోయింది. తమిళ నాడులో బాగానే ఆడిన ఈ సినిమా, తెలుగులో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. అలానే రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలబడ్డాయి.

 

అనంతరం ఫిబ్రవరిలో కార్తీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవ్ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. తరువాత మార్చి నెలలో కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ దర్శకత్వంలో రూపొందిన 118 కూడా ఫ్లాప్ అయింది. ఇక మే లో సూర్య హీరోగా తెరకెక్కిన ఎన్జీకే, అలానే బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కలయికలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమాలు ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయాయి. ఇక జూన్ లో ఆర్ఎక్స్ 100 కార్తికేయ నటించిన హిప్పీ, విష్ణు హీరోగా తెరకెక్కిన ఓటర్ సినిమాలు ఘోరంగా విఫలం అయ్యాయి. అలానే జులై లో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక కలయికలో వచ్చిన దొరసాని, శ్రీహరి పెద్ద కొడుకు మేఘాంశ్ హీరోగా తెరకెక్కిన రాజ్ దూత్ సినిమాలు అంచనాలు అందుకోలేదు. జులైలో విజయ్ దేవరకొండ, రష్మిక కలయికలో ఎన్నో అంచనాలతో తెరకెక్కిన డియర్ కామ్రేడ్, అలానే ఆగష్టు లో నాగార్జున హీరోగా తెరకెక్కిన మన్మధుడు2 ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

అదే నెలలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రణరంగం ఫ్లాప్ అవ్వగా సూర్య హీరోగా కెవి ఆనంద్ దర్శత్వంలో రూపొందిన బందోబస్త్ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా నిలిచింది. ఇక అక్టోబర్ లో గోపిచంద్ నటించిన చాణక్య, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజు గాడి గది 3 ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇకపోతే నవంబర్ లో రవిబాబు ఆవిరి, విజయ్ దేవరకొండ ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన మీకు మాత్రమే చెప్తా, సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ, విశాల్ తమన్నా నటించిన యాక్షన్, జ్యోతిక జాక్పాట్, సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ నెలలో రామ్ గోపాల్ వర్మ తీసిన అమ్మరాజ్యంలో కడప బిడ్డల ఫ్లాప్ కాగా, మరికొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version