న‌వ్వులు పూయిస్తున్న గ‌ల్లీరౌడీ టీజ‌ర్‌.. స‌రికొత్త‌గా సందీప్ కిష‌న్‌

మ‌న‌కు స‌క్సెస్ తో సంబంధం లేదు గురూ.. ట్యాలెంట్ ఉంది అది చాలు మ‌న‌కు అంటూ వ‌రు సినిమాల‌ను లైన్ లో పెడుతూ బిజీ హీరోగా మారిపోయాడు సందీప్ కిష‌న్‌. స‌క్సెస్ మాట విని చాలా రోజులు అవుతుంద‌ని ఆయ‌నే మొన్న ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఎంతైనా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి హీరోగా సెటిల్ అయ్యాడు క‌దా అందుకే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ‌. ఇక ఈ యువ హీరో తాజాగా నటించిన గ‌ల్లీ రౌడీ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది.


ఎప్ప‌టి క‌ప్పుడు కొత్త ప్రయోగాలు చేయడంతో పాటు కమర్షియల్ గా అన్ని రకాల సినిమాలను చేస్తుంటాడు మ‌న సందీప్ కిష‌న్‌. ఇక ఇప్పుడు జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్ష‌న్ లో గల్లీ రౌడి అనే కొత్త క‌థ‌తో రెడీ అయిపోయాడు. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ మూవీ టీజ‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. విజ‌య్ మాట్లాడుతూ ఈ సినిమా అందరినీ నవ్వించడానికి రెడీ అవుతోందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధ‌న్య వాదాలు తెలిపాడు విజ‌య్‌.
ఇక టీజర్ విష‌యానికొస్తే మంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఈ సిన‌మాతో ఈ సారి సందీప్ కిషన్ హిట్ కొట్టేలా ఉన్నాడు.ఫ్యామిలీ సపోర్ట్ తో రౌడీగా మారే కుర్రాడు.. ఓ అమ్మాయి చెప్పే కిడ్నాప్ తో ఎలాంటి ఇబ్బందులు ప‌డుతాడు అనే బ్యాక్ గ్రౌండ్ లో సినిమా సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ హీరోతో ఉండే స్నేహితుల‌తో మంచి కామెడీ క్రియేట్ అవుతుంద‌ని టీజ‌ర్ చెప్తోంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఫన్నీ డైలాగ్స్ మ‌రింత హైప్ ను తీసుకొస్తున్నాయి. చివరగా సందీప్ కిషన్ చెప్పిన ‘నెపోటిజమ్’ డైలాగ్ కూడా అభిమానుల‌కు బాగానే న‌చ్చింది. మ‌రి ఈ సినిమాతో మ‌న హీరో స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌స్తుంది.