‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘ధోప్’ సాంగ్‌ ప్రోమో విడుదల

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ధోప్’ సాంగ్‌పై చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ సాంగ్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉండటం ఖాయమని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా..?  ఇది ఎలా ఉంటుందా అని అభిమానుల్లో ఆతృత మొదలైంది.

ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ది మోస్ట్ అవైటెడ్ ‘ధోప్’ సాంగ్‌ను డిసెంబర్ 21న USA లో విడుదల చేయనుండగా.. డిసెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు  అనౌన్స్ చేశారు. ఇక ఈ పాటకు సంబంధించిన ప్రోమోను  తాజాగా రిలీజ్ చేశారు. ప్రోమోలో  రామ్ చరణ్, అందాల భామ కియారా అద్వానీల డ్యాన్స్  ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version