ఓటీటీకి వచ్చేసిన ‘గాండీవదారి అర్జున’ – స్ట్రీమింగ్ ఎందులో అంటే ?

-

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్.. ప్లాఫ్​లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఈ మెగా హీరోగా ప్రధాన పాత్రలో నటించిన.. ప్రవీణ్‌ సత్తారు రూపొందించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఇందులో వరుణ్‌కు జోడిగా సాక్షి వైద్య నటించింది.

Gandeevadhari Arjuna
Gandeevadhari Arjuna

ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌ గా నిలిచింది. అయితే…మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవదారి అర్జున’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news