ఏడేళ్ల బాలుడిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన 65 ఏళ్ల వ్యక్తి..!

-

అభం శుభం తెలియని చిన్నారులపై రోజురోజుకు  లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోక్సో, నిర్భయ, దిశ లాంటి కఠినమైన చట్టాలు ఎన్ని  వచ్చినా..కానీ వేధింపులకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.  ఓవైపు మహిళలు, మరోవైపు బాలికలు.. వీరే కాకుండా కొంత కామాంధులు బాలురపై కూడా లైంగిక దాడులు జరగడం గమనార్హం. తమను ఎవరూ పట్టుకోరన్న ధైర్యంతో ఎంతోమంది నేరాలకు పాల్పడుతూ తమ లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఇలాంటి అమానుష ఘటనలకు పాల్పడుతున్నారు.

వయసు, లింగంతో సంబంధం లేకుండా కొందరు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.. తాజాగా ఇలాంటి ఘటన హైదరబాద్ లోని బొరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడిపై 65 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే బోరబండ సైట్ 3 బ్రాహ్మణవాడ బస్తికి చెందిన దంపతులు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. ఉదయం తల్లి తండ్రులు పనికి వెళ్లగా.. బాలుడు స్కూలుకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు.

ఇంటి పరిసర ప్రాంతాల్లో బాలుడు ఆడుతుండగా.. అదే ప్రాంతంలో పాన్ షాప్ నడిపిస్తున్న సయ్యద్ రాహుఫ్ అనే 65 ఏళ్ల వ్యక్తి బాలుడిని షాపులోకి పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అమానుషమైన ఘటనను అటుపక్కగా వెళుతున్న ఓ వ్యక్తి చూసి బాలుడిని ఇంటికి పంపించి వారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడిని ప్రశ్నించగా నిజమేనని.. మూడు రోజులుగా ఇదే విధంగా చేస్తున్నాడని తెలిపాడు. ఎవరికైనా చెబితే చంపేస్తా అని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. వెంటనే బాలుడు యొక్క తల్లిదండ్రులు మరియు బంధువులు స్థానికులు సహాయంతో బోరబండ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. సయ్యద్ రాహుఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news