గొప్ప మ‌న‌స్సు చాటుకున్న బండ్ల గ‌ణేశ్‌.. ఏం చేశాడంటే..?

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా త‌న కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు బ‌డా ప్రొడ్యూస‌ర్‌గా దూసుకుపోతున్నాడు బండ్ల గణేశ్(bandla ganesh). ఆయ‌న‌కు ఉన్న ప్ర్య‌తేక‌త ఏంటంటే త‌న మనసులో ఏదున్నాకూడా మొహ‌మాటం లేకుండా బ‌య‌ట‌కు చెప్పేస్తుంటారు ఆయ‌న‌. ఇంకా చెప్పాలంటే ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు తాను పెద్ద భక్తుడనని, ఆయ‌న‌పై నిత్యం పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తుంటారు. ఇక రాజ‌కీయంగా పెద్ద‌గా ఆయ‌న‌కు క‌లిసి రాలేదు.

బండ్ల గణేశ్/bandla ganesh

అయితే ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా కూడా ఆయ‌న అవేవీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంటారు. ఇక తాజాగా ఓ విషయమై గణేశ్‌ స్పందించిన తీరు ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సుల‌ను క‌రిగించింద‌నే చెప్పాలి. ఇంత‌కీ ఆయ‌న ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

రీసెంట్‌గా బండ్ల లింగయ్య అనే వ్యక్తి ప్రమాదం తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నాడు. కాగా లింగ‌య్య‌ది క‌డు పేద కుటుంబం. ఈ క్ర‌మంలో లింగ‌య్య దీన గాథ‌ను వివ‌రిస్తూ ఆయ‌న సోదరుడు బండ్ల గణేశ్‌కు ట్యాగ్ చేసి సాయం చేయాల‌ని కోరాడు. త‌న అన్న‌కు ఇటీవ‌ల ఆటో ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడ‌ని, ఆరు నెల‌లు రెస్ట్ తీసుకోవాల‌ని డాక్టర్లు చెప్పార‌ని, కానీ వారి కుటంబ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని ఎలాగైనా ఆదుకోవాలంటూ కోరాడు. ఇక దీనిపై బండ్ల గణేశ్ స్పందించి లింగ‌య్య గూగుల్ పే నంబ‌ర్ పంపించు ఆదుకుంటాను అని రిప్లై ఇచ్చారు. దీంతో నువ్వు సూపర్‌ అన్న, నువ్వు దేవుడు అంటూ బండ్ల గ‌ణేశ్‌కు కామెంట్లు పెడుతున్నారు ఆయ‌న అభిమానులు.