అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేసన్ లో వచ్చిన.. తాజా సినిమా పుష్ప. డిసెంబర్ 17 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే.. తాజాగా గరికపాటి నరసింహారావు పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ లను గరికపాటి ఏకిపారేశారు. ఆ ఇద్దరూ తన దగ్గరకు వస్తే… కడిగి పారేస్తానని నిప్పులు చెరిగారు.
ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారని ఫైర్ అయ్యారు గరికపాటి. స్మగ్లింగ్ ను ప్రోత్సహించేలా.. ఈ సినిమా ఉందని.. దీన్ని చూసి సమాజంలో మనుషులు చెడిపోతే.. ఎవరిది బాధ్య త అని నిలదీశారు. స్మగ్లింగ్ ను, రౌడీయిజాన్ని ప్రోత్సహించడం.. రోడ్డు మీద పోయేవాళ్లను చెంప దెబ్బ కొట్టి తగ్గేదేలే.. అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాముడు, హరిశ్చంద్రుడు లాంటి వారు అలాంటి డైలాగులు వాడాలి కానీ.. స్మగ్లర్లు ఎలా వాడుతారని.. అలాంటి వారిని ప్రోత్సహిస్తూ అసలు సినిమాలు ఎలా తీస్తారని గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుష్ప రాజ్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. pic.twitter.com/ZAor5un2Wc
— . (@IamKKRao) February 2, 2022
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాహిత్యం, విద్య విభాగం నుంచి పద్మ శ్రీ పురస్కారం ప్రకటించింది. దేశ విదేశాల్లో అవధానాలు చేసిన గరికపాటి ధారణా రాక్షసుడు! అవధాన శారధ వంటి బిరుదాంకితులు. కళా రత్న. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం. కొప్పవరపు కవుల పురస్కారం. కనకాభిషేఖం. సువర్ణ కంకణాలు. ఎం.ఫిల్ లో విశ్వవిద్యాలం లో ఫస్ట్ వచ్చి ఎన్ టీ ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాలు అందుకున్నారు. ముక్కుసూటి, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ద్వారా నేటి తరం యువతకు బాగా దగ్గరయ్యారు.