గీతా గోవిందం రిలీజ్ కు ముందే లీక్..!

-

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా గీత గోవిందం సినిమాకు బాగా క్రేజ్ వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేశాడు. సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన నటించింది. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక గీత గోవిందం మీద కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని సీన్స్ ముందే యూట్యూబ్ లో పెడుతున్నారట.

అది కూడా సినిమాలో ఉన్న సీన్స్ కాకుండా డిలీటెడ్ సీన్స్ అని అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేయడం చూశాం కాని రిలీజ్ కు ముందే అది కూడా ప్రమోషన్స్ లో సినిమాలో డిలీటెడ్ సీన్స్ ఆన్ లైన్ లో వదలడం కొత్త విషయమే. విజయ్ మార్క్ ప్రమోషన్స్ తో వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేశాయి.

తప్పకుండా సినిమా కూడా ఆడియెన్స్ కు నచ్చేస్తుందనే నమ్మకంతో చిత్రయూనిట్ ఉన్నారు. అర్జున్ రెడ్డితో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా తర్వాత టాక్సీ వాలా రిలీజ్ కు రెడీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version