టీ షర్ట్ పై గాంధీ బొమ్మ తో అనసూయ జ‌న‌గ‌ణ‌మ‌న‌…. నెట్టింట ట్రోల్స్…!

జబర్దస్త్ బ్యూటీ యాంకర్ అనసూయ పరిచయం అక్కర్లేని పేరు. రీసెంట్ గా అన‌సూయ‌ పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో దాక్షాయణి అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో అన‌సూయ‌ పాత్రకు స్కోప్ త‌క్కువ ఉన్నా మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడంతో అనసూయ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. అంతేకాకుండా అనసూయ పాత్ర పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2లో బాగుంటుందని సుకుమార్ వెల్లడించారు. పుష్ప 2 లో అనసూయ కూడా విలన్ గా కనిపించబోతోంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

anasuya

మరోవైపు అన‌సూయ ర‌వితేజ ఖిలాడి సినిమా లోనూ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అదేవిధంగా ఓ మలయాళ చిత్రంలోనూ అనసూయ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనసూయ సమయం దొరికినప్పుడల్లా నెట్టింట హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే అన‌సూయ రీసెంట్ గా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనగణమన పాడుతూ ఓ వీడియోను షేర్ చేసింది.

anasuya baradwaj

ఈ వీడియోలో అనసూయ గాంధీజీ బొమ్మ ఉన్న టీ షర్ట్ ను ధరించింది. అయితే గణతంత్ర దినోత్సవానికి గాంధీజీ కి సంబంధం ఏంటని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ ను గుర్తు చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా అనసూయ కూర్చుని జనగణమన పాడింది. దాంతో దేశం అంటే గౌరవంతో పాట బాగా పాడుతున్నారు కానీ జనగణమన పాడేటప్పుడు నిలుచుని గౌరవంగా ఇవ్వాలి క‌దా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దాంతో అనసూయ త‌న‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ గా తెలంగాణ యాస‌లో ఓ స్టోరీ షేర్ చేసింది…. ఏందిరా బై మీరు గాంధీకి రాజ్యాంగానికి సంబంధం లేదు అంటారు… జాతీయ గీతం అంటున్నారు. మరి జనగణమన స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవానికి కూడా పాడుతున్నారు కదా…. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని ఆలోచించండి. అంటూ పేర్కొంది.

https://www.instagram.com/reel/CZLz2EfjtBW/?utm_medium=copy_link