ఇష్టం లేని శృంగారానికి భర్త బలవంతం… ఏకంగా దాన్నే కోసేసిన భార్య

-

సమాజంలో చాలా మంది భార్యలు మౌనంగా అనుభవిస్తున్నదే. తన ఇష్టం లేకుండా భార్యపై సెక్స్ కోసం భర్తలు ఒత్తడి చేస్తున్నారు. వద్దని వారించినా.. వినిపించుకోలేని భర్తలు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది మౌనంగా భరిస్తున్నా.. కొంత మంది భార్యలు మాత్రం ఎదురుతిరుగుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఇష్టం లేని ఇష్టం లేని శృంగారానికి భర్త బలవంత చేయడంతో ఏకంగా భర్త మర్మాంగానే కొసేసింది. డిసెంబర్ లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టీకంగఢ్ జిల్లాలో చేటుచేసుకుంది. డిసెంబర్ 7న టీకంగఢ్ పట్టణం రామ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 26 ఏళ్ల బాధితుడిపై భార్య అయిన 24 ఏళ్ల యువతి పదునైన ఆయుధంతో దాడి చేసింది. బాధితుడు ఫిర్యాదులో ‘‘ నాభార్యకు ఇష్టం లేకున్నా శృంగారం పాల్గొనేందుకు ప్రయత్నించా.. దీంతో ఆమె నా మర్మాంగాన్ని కోసేసింది’’  అని పేర్కొన్నాడు.

అయితే ఈ జంటకు 2019లో వివాహం జరిగింది. కానీ కొన్ని రోజులకే మనస్పర్థలతో విడిపోయారు. మళ్లీ పెద్దల పంచాయతీలో నచ్చచెప్పడంతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే భర్త, తన భార్యకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా శృంగారం చేయడానికి ప్రయత్నించాడు.. దీంతోనే భార్య ఈ దారుణానికి ఒడిగట్టింది. ఘటన డిసెంబర్ 7న జరిగినా… శస్త్ర చికిత్స చేయించుకుంటున్న సమయంలో వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని పోలీస్ అధికారి త్రివేది వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news