మేడారం భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్… 3845 స్పెషల్ బస్సులు

-

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి రంగం సిద్దమవుతోంది. మరోవైపు భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలను కలిపిస్తోంది. ఇదిలా ఉంటే మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మేడారం జాతరకు 3845 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రతీ ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. ఒక్కో ప్రయాణికుడికి హైదరాబాద్ నుంచి మేడాారానికి రూ.405 వసూలు చేస్తోంది.

ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరుగబోతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా… ఒడిశా, చత్తీస్ గడ్, మహారాష్ట్రల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మేడారానికి తరలివస్తుంటారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని ప్రతీ పట్టణం, మండలం కేంద్రం నుంచి మేడారానికి ప్రత్యేకంగా బస్సులను నడపనుంది టీఎస్ ఆర్టీసి. రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news