మెగా ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలింది. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన గని మూవీ మరోసారి వాయిదా పడిపోయింది. ఈ మేరకు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఫిబ్రవరి 25 వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ కు గందర గోళం ఏర్పడుతుందని…. భావించి… గని మూవీని మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది. గతంలోనూ.. అంటే డిసెంబర్ 25 న ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో.. అప్పుడు వాయిదా వేసుకుంది.ఇక ఈ మూవీ విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటన ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఇది ఇలా ఉండగా… అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.