ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పెరిగిన జీతాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. వేతన సవరణ లో భాగంగా గత ఏడాది ఏప్రిల్, మే నెలల పెరిగిన జీతాన్ని 18 వాయిదాల్లో చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ జీతం తో మొదటి వాయిదా ప్రారంభం కానుంది. గత ఏడాది జూన్ నుండి పెరిగిన జీతాలు ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
వేతన సవరణను ఏప్రిల్ 1..2020 నుండి అమలు చేయాలని ఉత్తర్వులలో పేర్కొంది. ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు పెరిగిన జీతాల బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఏప్రిల్ 2021, మే 2021 బకాయిల ను ఈ ఆర్థిక సంవత్సరం లోనే చెల్లిస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కార్… వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 18 వాయిదాల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ అధికారిక ఉత్తర్వుల ను జారీ చేసింది కేసీఆర్ సర్కార్.