“గాడ్ ఫాదర్” ఫస్ట్ సాంగ్ ప్రోమో నేడే

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు మేకర్స్.

ఈ టీజర్ లో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతిి తెలిసిందే.  ఈ చిత్రంలో నయన్ ” సత్యప్రియ జై దేవ్” గా పరిచయం చేశారు. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అలాగే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ లో మరో స్టార్ హీరోని ఈవెంట్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ నుండి నేడు సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ సాంగ్ ప్రోమో ని విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుండి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఈ ఫస్ట్ సాంగ్ ప్రోమో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news