ఆర్ఆర్ఆర్ గురించి అదిరిపోయే న్యూస్…!

-

స్టార్ హీరోలు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో… ప్రముఖ దర్శకుడు రాజామౌళీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్… ఇటీవల ఈ సినిమా మోషన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలాగే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన పరిచయం కూడా చిత్ర యూనిట్ ఆయన పుట్టిన రోజు సందర్భంగా చేసింది. ఈ వీడియో ని చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఇది ఇప్పుడు ఒక ఊపు ఊపుతుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి బాలీవుడ్ కూడా మాట్లాడుకుంటుంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసారు. త్వరలోనే పూణే లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల మధ్య ఒక భీకర పోరాటం ఉంటుంది అంటున్నారు.

మొదటిసారి ఓ అడవిలో ఎదురుపడిన సందర్భంలో ఈ ఇద్దరి మధ్య భీకర పోరు జరుగుతుంది అంటున్నారు. ఫైట్‌ను రాజమౌళి భారీ ఎత్తున షూట్ చేసినట్టు సమాచారం. దాదాపు పది నిమిషాల పాటు ఈ సీన్ ఉండే అవకాశం ఉందని అక్కడితో ఇంటర్వెల్ సన్నివేశం పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనికోసం భారీగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news