సూపర్ స్టార్ మహేష్ బాబు… సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు. అందరిలో నెలకొన్న ఆసక్తి ఇదే. దాదాపు మూడు నాలుగు కథలు అతను విన్నాడు. అలాగే వంశీ పైడపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా ఒక కథ విని దాన్ని లైన్ లో పెట్టాడు. కాని ఆ కథ మహేష్ కి నచ్చలేదు. దీనితో కథను వద్దని మార్పులు చెయ్యాలని సూచించాడు. దీనికి వంశీ కష్టపడినా… మారిస్తే బాగోదని వదిలేసాడు ఆ కథను.
ప్రస్తుతం మహేష్ బాబు ఏ సినిమా చేస్తున్నాడు అనేది స్పష్టత వచ్చింది. వంశీ తర్వాత గీత గోవిందం దర్శకుడు… పరుశారం దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు అందరూ అనుకున్న విధంగానే మహేష్ బాబు ఆ సినిమాను ఫైనల్ చేసాడు. కరోనా వైరస్ తర్వాత ఆ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత సినిమా మొదలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మహేష్ బాబు… అడ్వాన్సు కూడా తీసుకున్నాడని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా 14 రీల్స్ ప్లస్ సంస్థలతో పాటు మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నాయి.