తెలంగాణాలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆరు కరోనా కేసులు నమోదు అయినట్టు వెల్లడైంది. ఉదయం మూడు కేసులు నమోదు కాగా మధ్యాహ్నం మరో మూడు కేసులు నమోదు అయ్యాయి. దీనితో తెలంగాణా ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఓపీ సర్వీసులను రద్దు చేసింది.
కాసేపటి క్రితం మీడియా తో మాట్లాడిన మంత్రి ఈటెల రాజేంద్ర ఈ ప్రకటన చేసారు. ప్రస్తుతం ఆందోళన అవసరం లేదని ఆయన మీడియాకు వివరించారు. ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న కేసులు అన్నీ కూడా ప్రాణాపాయం లేదని అందరూ సురక్షితంగా ఉన్నారని మంత్రి వివరించారు. ఈ కేసులు అన్నీ కూడా ఉత్తర తెలంగాణాలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. దీనితో అక్కడి ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతుంది.
ప్రజలకు ఎన్ని విధాలుగా సూచనలు చేసి బయటకు రావొద్దని హెచ్చరించినా సరే ప్రజలు మాత్రం ఇళ్ళల్లో ఉండటం లేదు. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 33 కి చేరుకుంది. ఇవి మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ని అమలు చేయనున్నారు. చేయి దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు.