ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి శుభవార్త.. ఏంటంటే..?

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం దాదాపు తన రెండు సంవత్సరాల సమయాన్ని వేరే సినిమాకు కేటాయించలేదని చెప్పాలి. దాంతో ఆయన అభిమానులకు వరుసగా ఇప్పుడు ట్రీట్ల మీద ట్రీట్లు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానుల కోసం గ్యాప్ లేకుండా సినిమాలు ప్రకటిస్తూ వారికి శుభవార్తల మీద శుభవార్తలు అందిస్తున్నారనే చెప్పాలి. అందులో భాగంగానే వరుసగా కథలు వింటూ సినిమాలను కూడా సెట్ చేస్తున్నారు.

ఇప్పుడు తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో గరుడ సినిమా చేయడానికి సిద్ధమైన ఆయన.. ఆ సినిమా అయిన వెంటనే అనిల్ రావిపూడి తో ప్రాజెక్టు కూడా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక బాలయ్యతో సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆయన అందుకు తగ్గట్లుగానే గతంలో పటాస్ సినిమాను ఎన్టీఆర్ కోసం రాసుకుంటే.. అది కళ్యాణ్ రామ్ కి బాగుంటుందని చెప్పారట ఎన్టీఆర్. అలా ఆ సినిమా బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ ఒక కథ సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఇక అంతా ఓకే అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news