పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త.. “హరి హర వీరమల్లు” నుండి బిగ్ అప్డేట్

-

వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి వరుస సూపర్ హిట్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..కెరీర్ లో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడిక్ జానర్ లో సినిమా చేస్తుండడంతో ఆయన అభిమానులు మాత్రమే కాదు..ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని నిర్మించిన AM రత్నం గారు ఈ సినిమాని కూడా సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు..హాలీవుడ్ కి చెందిన ఎంతో మంది టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు..పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ” హరిహర వీరమల్లు” నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 2 వ తేదీ సాయంత్రం 5:45 గంటలకు ఈ చిత్రం నుంచి ” పవర్ గ్లాన్స్” విడుదల కానుంది. ఇందులో కంటెంట్ పవన్ అభిమానులని ఉర్రూతలూగించడం ఖాయమని భావిస్తుంది చిత్ర బృందం. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news