హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ పూర్తి అయింది. కాసేపటి క్రితమే ఈ పూజ పూర్తి అయింది. ఇక ఈ తొలి పూజలో తెలంగాణ మంత్రి తలసాని, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. కాగా.. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఇవాళ్టి నుంచి నిమజ్జనం అయ్యే వరకు ఉంటాయి. ఇవాళ మధ్యాహ్నం మూడు 3 నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయి.
#ట్రాఫిక్ ఆంక్షలు ఇవే
రాజీవ్ గాంధీ విగ్రహం వైపు నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వెళ్లే వాహనాలకు నిరాంకారి వైపు మళ్ళిస్తారు. ఖైరతాబాద్ మార్కెట్ వైపు నుంచి లైబ్రరీ వైపు వచ్చే వాహనాలు లైబ్రరీ వెనుక ఉండే ఎంసీహెచ్ షానిటరీ వార్డు ఆఫీస్ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మిస్టు కాంపౌండ్ లైను నుంచి నక్లేస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్ ప్రింటింగ్ ప్రెస్ వైపు మళ్లిస్తారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనాదారులు ప్రత్యామ్నాయ రోడ్లలో వెళ్లి పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి కోరారు.