తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ ఎన్ని రోజులకు సినిమా..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. ఇక వరుసగా 10 సినిమాలు తెరకెక్కించినా పది సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దాంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పడం జరిగింది. అయితే గడిచిన కొద్దిరోజుల క్రితం 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక దీంతో ఇప్పుడు తాజాగా ఒక సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

తాజాగా నందమూరి హీరో నటిస్తున్న సారధి చిత్రాన్ని పంచభూత క్రియేషన్ బ్యానర్ పై యువ డైరెక్టర్ జాకట రమేష్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన లభించడంతో నందమూరి అభిమానులతో పాటు ఈ సినిమా చిత్ర బంధం కూడా మంచి నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఈ చిత్రం అవుట్ పుట్ చాలా అద్భుతంగా రావడం జరిగిందని డైరెక్టర్ జాకట రమేష్ తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి నరేష్ యాదవ్ కృష్ణమూర్తి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే మొదట డైరెక్టర్ జాకాట రమేష్ మొదట షార్ట్ ఫిలిమ్ అయిన రథేరా తన కెరీర్ ని మొదలుపెట్టి ఇప్పుడు డైరెక్టర్ గా మారినట్లు తెలుస్తోంది. ఇక గ్రామీణ క్రీడ అయిన ఖో ఖో నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రంగా ఈ సినిమా ట్రైలర్ ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారట. ఇక మొదటి ప్రయత్నంలోని విజయం సాధించడంతో రెండవ ప్రయత్నంగా సారథి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో హీరో తారకరత్న బిగ్గెస్ట్ అసెట్ అని కూడా చెప్పవచ్చు. తారకరత్న కెరియర్ లోని ఈ సినిమా బెస్ట్ గా కానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news