‘దేశానికి కేసీఆర్ అవసరం’..ఈ కాన్సెప్ట్ ఏంటి?

-

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ దాదాపు ఖాయమైపోయినట్లే. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ హల్చల్ చేస్తున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లలేదు. అయితే జాతీయ పార్టీ పెట్టి మరీ కేంద్రంలో ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీఏ‌పి‌ఐ కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చించిన విషయం తెలిసిందే. త్వరలోనే పార్టీ పెట్టి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ముమ్మరం చేయనున్నారు.

సరే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారు..ఇక్కడ వరకు బాగానే ఉంది..కానీ ప్రతి ఒక్కరూ దేశానికి కేసీఆర్ అవసరం ఉందని, ఆయన్ని దేశ ప్రజలు పిలుస్తున్నారని నేతలు డప్పు కొట్టడం ఎక్కువైపోయింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం అనేది..పూర్తిగా రాజకీయ పరమైన అంశం. అలా కాకుండా మోదీ వల్ల దేశం నాశనమైపోయింది..అటు కాంగ్రెస్ పని అయిపోయింది. అందుకే దేశానికి కేసీఆర్ అవసరమని ప్రజలు తెగ డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెబుతున్నారు…టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

ఇక కేసీఆర్ కలిసిన ప్రతి నేత కూడా..దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందని మాట్లాడుతున్నారు. మరి నిజంగానే దేశ ప్రజలు కేసీఆర్‌ని కోరుకుంటున్నారా? లేక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ఇదొక కాన్సెప్ట్ పెట్టుకుని నేతలతో భజన చేయించుకుంటున్నారా? అనేది క్లారిటీ రావడం లేదు. టీఆర్ఎస్ అనేది తెలంగాణకు పరిమితమైన పార్టీ…ఈ పార్టీకి ఇంకా ఏ రాష్ట్రంలోనూ ఆదరణ లేదు. కేసీఆర్ అంటే దేశ ప్రజలకు పూర్తిగా తెలియదు.

కానీ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్‌ని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అంటే మరి ఇదెక్కడి కాన్సెప్ట్ అనేది అర్ధం కాకుండా ఉంది. ఇటీవల టీఆర్ఎస్ నేతలు ఇదే తరహాలో భజన చేశారు. తాజాగా గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సింగ్‌ వాఘేలా, కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయన కూడా దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందని మాట్లాడారు. అంటే జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేప్పుడు ఈ మాత్రం హైలైట్ అవ్వకపోతే ఇబ్బంది అని టీఆర్ఎస్ ఈ తరహా రాజకీయం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news