గార్డెన్‌లో పాములు రాకుండా ఉండాలంటే ఈ మొక్కలు పెంచండి..!

-

ఈరోజుల్లో చాలాందికి ఇండోర్‌, ఔట్‌డోర్‌ డెకరేషన్‌పై శ్రద్ధ బాగా పెరిగింది. ఆర్టిఫీషియల్‌గా గ్రీనరీ కంటే నాచురల్గా మొక్కలు పెంచుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే గార్డెనింగ్‌కు ఎక్కువ స్థలం ఉంటే..పెద్ద పెద్ద మొక్కలు పెంచుకోవచ్చు. మనం పెంచే మొక్కల వల్ల అందం ఒక్కటి ఉంటే సరిపోదు.. వాటి వల్ల దోమలు, పాములు లాంటివి కూడా రాకుండా చూసుకోవాలి. మీ గార్డెన్‌లో ఈ మొక్కలు పెంచుకుంటే..పాములు అస్సలు రావట..అవంటంటే…

హోలీ(Holly)

పాము వికర్షక మొక్కల్లో ఒకటి హోలీ. చాలా తక్కువ ఎత్తులోనే ఇది పెరుగుతుంది. కానీ ఈ మొక్క పాములు రాకుండా నిరోధిస్తుంది. మీ పెరట్లో ఈ మొక్కని పెంచితే పాములు పారిపోవాల్సిందే. కానీ నెలకి ఒకసారి అయినా ఆ మొక్క పొద మాత్రం శుభ్రం చెయ్యాలి. దాని ఆకులు కూడా పెరట్లో వెదజల్లుకోచ్చు.

లెమన్ గ్రాస్

పాములనే కాదు కందిరీగలు కూడా ఇది ఉంటే దరి చెరలేవు. లెమన్ గ్రాస్ శ్రీలంగ్, దక్షిణ భారతదేశంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తేమ, వెచ్చని వాతావరణం వీటికి అనువుగా ఉంటుంది. పాములను దూరంగా ఉంచే సిట్రస్ సువాసన వెదజల్లుతుంది. దోమలు కూడా రావు.

మేరిగోల్డ్స్(Marigolds)

ఫ్రెంచ్, అమెరికన్ మేరిగోల్డ్ రెండూ బలమైన ఘాటు వాసన కలిగి ఉంటాయి. ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో ఇవి ఉంటాయి. ఇవి పాములను బాగా దూరంగా ఉంచుతాయి. ఈ మొక్క పూలు చూసేందుకు చాలా మనోహరంగా ప్రకాశవంతంగా ఉంటాయి. పాములని తిప్పికొట్టే ఘాటైన వాసన ఇవి విడుదల చేస్తాయి. పాము దాక్కున చోటికి కూడా ఈ వాసన వెళ్లగలదు. కనుక అవి మట్టిలో ఎక్కడైనా దాక్కున్నా కూడా అక్కడికి కూడా వాసన వెళ్ళిపోతాయి.

వెల్లుల్లి..

ఉల్లిపాయ, అల్లియం మాదిరిగానే వెల్లుల్లిలో కూడా అధిక పరిమాణంలో సల్ఫోనిక్ ఆమ్లం ఉంది. ఈ వాసన అంటే పాములకు చిర్రెత్తుతుంది. కూరల్లో తప్పకుండా వెల్లుల్లి వేసుకుంటారు. ఇది వంటలకి అదనపు రుచి ఇవ్వడమే కాదు పాములని పారిపోయేలా చేస్తుంది. వెల్లుల్లి మొక్కల పువ్వులు కూడా అందంగా ఉంటాయి.

అల్లియం..

ఇందులో ఉండే అధిక సల్ఫోనిక్ కంటెంట్, ఘాటైన వాసన కారణంగా పాములను చాలా దూరంగా ఉంచుతుంది. లావెండర్ కలర్లో ఉండే ఈ మొక్క పువ్వు చూసేందుకు చాలా ముద్దుగా కనిపిస్తుంది. పాములు, నత్తలు ఈ మొక్క ఉన్న ప్రదేశాలకి రాలేవు.

ఇవే కాదు స్నేక్ ప్లాంట్, వార్మ్ వుడ్, పింక్ అగాపంథస్, బసిల్ వంటి అనేక మొక్కలు కూడా మీ పెరట్లో పెంచుకోవడం వల్ల సర్పాలు రాకుండా చేయవచ్చు. హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎంజాయ్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news