ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా, నందమూరి వంటి మాస్ హీరోలతో రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది.
ఇక ఈ సినిమా గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే, ఇద్దరు దర్శకులని చూపిస్తూ ఉండటంతో, ఫ్యాన్స్ విస్మయం చెందుతున్నారు. సినిమాకు దర్శకులుగా రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ అనే మరో వ్యక్తి పేరును కూడా గూగుల్ చూపిస్తోంది. ఇదే సమయంలో సంజయ్ పాటిల్ గురించి సెర్చ్ చేస్తే, ఎటువంటి సమాచారమూ రావడం లేదు. దీంతో ఆ సంజయ్ ఎవరన్నది గూగుల్ కే తెలియాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.