జెర్సీతో మరోసారి నాని తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాని మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అర్జున్ పాత్రలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు నాని. కథ చెప్పినప్పుడే తాను అద్భుతంగా ఫీల్ అయ్యానని నాని చెప్పాడు.
మళ్లీ రావా సినిమాతో ప్ర్తతిభ చాటుకున్న గౌతం తిన్ననూరి జెర్సీతో అదరగొట్టాడు. ఈ సినిమా కోసం అతను దాదాపు డజను క్లైమాక్సులు అనుకున్నాడట. ఫైనల్ గా సినిమాలో ఉన్న క్లైమాక్స్ ఫిక్స్ చేశారట. క్లైమాక్స్ ఎలా ఉంటే ఆడియెన్స్ మెప్పుపొందుతుందో అని గౌతం చాలా ఆలోచించాడట. క్లైమాక్స్ కోసమే చాలా టైం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి క్లైమాక్స్ ఇలా కాకుండా వేరేలా ఉంటే ఎలా ఉండేదో కాని ప్రస్తుతం ఉన్న క్లైమాక్స్ జెర్సీకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.