పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ స్థానికి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. స్థానికి ఎన్నికల్లో పోటీ చేస్తే జనసేనకు కలిసివస్తుందని బావించి పోటీకి సిద్ధమయ్యారు జనసేనాని. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన విషయం తెలిసిందే. అదే గుర్తుతో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసింది. తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జనసేనకు కొత్త చిక్కొచ్చి పడింది.
ఎంపీటీసీ కి క్రికెట్ బ్యాట్ , జడ్పీటీసీకి గాజు గ్లాస్ గుర్తు
జనసేనకు ఈ స్టానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు గుర్తులు వచ్చాయి. ఇప్పటికే జనసేన గ్లాసు గుర్తును జనాల్లోకి బాగానే తీసుకెళ్లింది. అదే గుర్తుతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసింది. అనూహ్యంగా ఎన్నికల సంఘం ఎంపీటీసీ కోసం ఒక గుర్తు, జడ్పీటీసీ కోసం మరో గుర్తు ఖరారు చేసింది. ఈ విషయాన్ని జనసేన తన అఫీషియల్ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఎంపీటీసీ కి క్రికెట్ బ్యాట్ , జడ్పీటీసీకి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించినట్లు తెలిపింది. అయితే రెండు ఎలక్షన్స్ ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఒక పార్టీకి రెండు గుర్తులు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమకు కేటాయించిన గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించేశారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తులు
ZPTC : Glass Tumbler ( గాజు గ్లాసు)
MPTC : Bat (బ్యాట్)
Note : MPTC లో గ్లాస్ గుర్తు లేనందున బ్యాట్ గుర్తు కేటాయించడం జరిగింది. pic.twitter.com/GXH0e8MK9F
— JanaSena Party (@JanaSenaParty) April 24, 2019