ఘనంగా ప్రారంభమైన మహేష్ బాబు పరశురాం “సర్కారువారి పాట” ..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్. ఇక గత నాలుగు అయిదు రోజులుగా మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో నానా హంగామా జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ కి భారీ గిఫ్ట్ ఇచ్చాడు.

 

పరశురాం దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నేడు మహేష్ బాబు తండ్ర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు కెరీర్ లో 27 వ చిత్రాన్ని అట్టహాసంగా మొదలు పెట్టారు.

ఈ సినిమాని జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, మత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సర్కారువారి పాట అన్న టైటిల్ ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version