టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి జనవని నెల చాలా కీలకలం. అందులోనూ సంక్రాంతి పండుగ చాలా ముఖ్యం. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసే సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ టాక్ అందుకుంటాయి. సెలవులు కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. అయితే సంక్రాంతికి విడుదల చేయాలని ప్రతి దర్శక, నిర్మాత ఆసక్తిగా ఉంటాడు. కానీ అవకాశం అందరికీ రాదు. అలా 2024 సంక్రాంతి వార్‌లో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తున్నాయి.
ఇందులో జనవరి 12న ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ ఏకంగా రెండు సినిమాలు ఒకే రోజున విడుదలజ్ కానున్నాయి. ఈ పోటీ నుంచి ఎవరూ తప్పుకోకపోవడంతో రెండు చిత్రాలు ఒకేరోజున రిలీజ్కు రెడీ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. 2000 సంవత్సరంలో రిలీజైన మహేశ్బాబు ‘యువరాజు’ సినిమాలో, ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహేశ్ కొడుకుగా నటించిన తేజ సజ్జ ఇప్పుడు ఏకంగా 2024 సంక్రాంతికి మహేశ్ సినిమాకు పోటీగా వస్తున్నాడంటూ ఓ ట్వీట్ సోషల్ వైరల్ అయింది.
ఈ ట్వీట్పై హనుమాన్ హీరో తేజ స్పందిస్తూ, ‘సూపర్స్టార్తో పోటీ ఏంటి సర్. ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా’ అని ట్వీట్కు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
#SuperStar tho poti enti sir 🤦♂️🙏
అయన తో పోటీగ కాదు సర్
అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8— Teja Sajja (@tejasajja123) January 2, 2024