వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు వైఎస్ షర్మిల. ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టిపిని విలీనం చేయనున్నారు వైఎస్ షర్మిల. అదే రోజు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు వైఎస్ షర్మిల.
వైఎస్ షర్మిలతో పాటు సుమారు 40 మంది కాంగ్రెస్ చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు వైఎస్ షర్మిల, పార్టీ నాయకులు. అయితే.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పాత్రపై స్పష్టత ఇంకా రాలేదు. వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారా? రాజ్యసభ సభ్యత్వమా అనేది తేలాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఇడుపులపాయ కు షర్మిల వెళ్లనున్నారు. రేపు ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ కు షర్మిల వస్తారు. ఎల్లుండి ఢిల్లీకి వైఎస్ షర్మిల పయనం అవుతారు.