నిహారిక కూడా తన భర్తను దూరం పెట్టేసిందా? అందుకే ఇలా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా వారసురాలు నిహారికకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటిగా, యాంకర్ గా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది నిహారిక. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ కూడా ఈమె.. అయితే మెగా ప్రిన్సెస్ గా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక వెండితెరపై మాత్రం అంతగా సక్సెస్ పొందలేకపోయింది. దాంతో తన సినిమా కెరియర్ ను సరిపెట్టుకుంది . ఆ తర్వాత అవకాశాలను అంతగా అందుకోలేక ఇండస్ట్రీకి దూరమై సోషల్ మీడియా ద్వారా బాగా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఒక నిర్మాతగా బాధ్యతలు చేపట్టి వెబ్ సిరీస్ విడుదల చేసి మంచి సక్సెస్ కూడా అందుకుంది నిహారిక.

వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. ఇప్పుడు పెళ్లి తర్వాత మరింత యాక్టివ్గా మారింది నిహారిక. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్చల్ చేస్తోంది. పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. హాట్ లుక్కులతో అందరినీ ఫిదా చేస్తూ తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలు కూడా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. అంతేకాదు తన స్నేహితురాళ్లతో కలిసి ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నాగబాబు గారాల కూతురు కావడంతో చాలా ఫ్రీడం దొరికింది. అందుకే నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది. దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియాకి కూడా దూరం అయింది. గతంలో జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండడం చూసి విమర్శలు ఎదుర్కొంది..అంతలోనే ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులో చిక్కి మరొక వివాదానికి తెరలేపింది.

అలా కొన్ని రోజుల తర్వాత ఇన్స్టాకు దూరమై ఇప్పుడు రిఫ్రెష్ అయ్యి ఇటీవల ఇన్స్టాలో రకరకాల ఫోటోలతో సోషల్ మీడియాలో మంట పెడుతోంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో పంచుకుంది. ఈ మధ్య నిహారిక ఒంటరిగా ప్రయాణం చేయడం.. భర్త లేకుండా దిగిన ఫోటోలను పెట్టడంతో చాలామందికి అనుమానాలు వస్తున్నాయి.. దీంతో కొందరు నెటిజెన్స్ నిహారిక తన భర్తను దూరం పెట్టేసిందా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై మెగా డాటర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Nihaa Konidela (@niharikakonidela)

Read more RELATED
Recommended to you

Latest news