ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న గోరుముద్ద పథకం విషయంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. జగనన్న బోరు ముద్ద స్కీమ్ లో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఒక కోడిగుడ్డు చొప్పున మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులకు అందిస్తున్నారు. అయితే గుడ్డు నాణ్యత లేకపోవడం ఇతర కారణాల వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో 10 రోజులకు ఒకసారి పాఠశాలలకు సరఫరా చేస్తున్న గుడ్లకు బదులుగా వారానికి ఒకసారి గుడ్లను సరఫరా చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోడిగుడ్డు నాణ్యత చెడిపోకుండా తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్ల సరఫరా చేయాలని పేర్కొంది. అలాగే ప్రతి వారం వచ్చే గుడ్లకు నాలుగు రంగుల స్టాంపులు వేస్తారు. గుడ్ల సరఫరా లో అక్రమాలకు తావు లేకుండా మొదటి వారం నీలం, రెండో వారం గులాబీ, మూడో వారం ఆకుపచ్చ అలాగే నాలుగో వారం వంగ పువ్వు రంగులతో గుడ్లపై స్టాంపింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.