HBD NTR: ఎన్టీఆర్ గురించి తెలియని కొన్ని విషయాలు ఇవే..!

-

HBD NTR: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాత నందమూరి తారకరామారావు దగ్గర ఓనమాలు దిద్ది.. డాన్స్లో మైకేల్ జాన్సన్ ను మరిపించేలా.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు ఇటు సెలబ్రిటీలు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నాడు.. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అనేలా మార్చుకున్నాడు. ఇకపోతే ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా ఈరోజును పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే కేవలం 19 సంవత్సరాల వయసులోనే స్టార్డంను చవిచూసిన ఎన్టీఆర్ ఆ తర్వాత వరుస ప్లాపులను కూడా చవిచూడాల్సి వచ్చింది. రాజమౌళి పుణ్యమా అని యమదొంగ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.. ఇకపోతే ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి.

వాస్తవానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ చిన్న వయసులోనే బాల రామాయణం సినిమాలో నటించి నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక తర్వాత నిన్ను చూడాలని ఉంది అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇక మొదట 4 లక్షల పారితోషకంతో మొదలైన ఆయన సినీ కెరియర్ ఇప్పుడు రూ.60 కోట్లకు పైగా తీసుకునే రేంజ్ కి ఎదిగిందంటే ఇక ఆయన స్టార్ డం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news