ఐపీఎల్ లో భాగంగా రాత్రి జరిగిన పంజాబ్ మరియు రాజస్థాన్ మ్యాచ్ లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ కు చేరకుండానే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. కాగా ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కు మాత్రమే ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కనుక టార్గెట్ ను 18 .3 ఓవర్ లలో ఛేదించి ఉంటే బెంగుళూరు కన్నా మెరుగైన రన్ రేట్ ను సాధించి ఉండేది. ప్రస్తుతం బెంగుళూరు 13 మ్యాచ్ లలో 7 గెలిచి 14 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది, ఇక రాజస్థాన్ కన్నా మెరుగైన రన్ రేట్ + 0.180 ను కలిగి ఉంది.
ఇక రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలుపు సాధించి కూడా తనకన్నా తక్కువ రన్ రేట్ + 0.148 ను కలిగి ఉంది. ఇక బెంగుళూరు తన ఆఖరి మ్యాచ్ లో కనీసం విజయాన్ని సాధిస్తే చాలు.. ప్లే ఆఫ్ కు అర్హత ఛేదిస్తుంది.