కొత్త నటీనటులకు , దర్శకులకు, నిర్మాతలకు అవకాశం ఇవ్వడం నందమూరి ఫ్యామిలీకి ఎలా అలవాటు ఉందో అలాంటి అలవాటే అక్కినేని వారసుడు అక్కినేని నాగార్జునకు కూడా ఉంది.. ముఖ్యంగా కొత్త టాలెంట్ ను ఎక్కడున్నా వెతికి పగట్టుకోవడంలో నాగార్జున తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుల లిస్టును కూడా ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
రాంగోపాల్ వర్మ:కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా నాగార్జున కావడం గమనార్హం. శివ సినిమాతో రాంగోపాల్ వర్మ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. నాగార్జున ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.
గీతాకృష్ణ:
సంకీర్తన సినిమాతో గీతాకృష్ణ అనే దర్శకుడిని తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగార్జున.
ఉప్పలపాటి నారాయణరావు:
జైత్రయాత్రతో ఉప్పలపాటి నారాయణరావును దర్శకుడిగా నాగార్జున పరిచయం చేశారు.
ప్రవీణ్ గాంధీ:
రక్షకుడు సినిమా ద్వారా తెలుగు కొరకు పరిచయమయ్యాడు ప్రవీణ్ గాంధీ.
వై.వి.ఎస్ చౌదరి:
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంతో వైవిఎస్ చౌదరిని దర్శకుడిగా నాగార్జున పరిచయం చేశారు నాగార్జున.
వంకినేని రత్న ప్రతాప్:
నువ్వొస్తావని అనే సినిమా ద్వారా స్వర్గీయ వక్కినేని రత్న ప్రతాప్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఆర్.ఆర్. షిండే:
నిన్నే ప్రేమిస్తా సినిమాతో దివంగత ఆర్. ఆర్. షిండే ను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కూడా నాగార్జునకే సొంతం.
జొన్నలగడ్డ శ్రీనివాసరావు:ఎదురులేని మనిషి సినిమాతో జొన్నల గడ్డ శ్రీనివాసరావును దర్శకుడిగా పరిచయం చేశారు నాగార్జున.
దశరథ్:సంతోషం సినిమాతో దశరథ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇక వీరితోపాటు అర్జున్ సంజనానీ, రాఘవ లారెన్స్, కిరణ్, కళ్యాణ్ కృష్ణ కురసాల, నాగ కోటేశ్వరరావు, అహిషోర్ సోలమన్, ప్రియదర్శన్, ఫాజిల్, మహేష్ బట్, కిలో మీరందరినీ కూడా తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత నాగార్జునకే సొంతం.