ఆ విభాగంలో మొదటి పద్మశ్రీ అందుకున్న నటుడు ఈయనే.!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అయితే కమెడియన్ల కు కొదవ లేదు అని చెప్పవచ్చు . ఇక కామెడీ షో లు వచ్చిన తర్వాత చాలామంది సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ కమెడియన్ల గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అంతేకాదు హీరోలు సైతం కామెడీని పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. అయితే గతంలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉండేది. ఎందుకంటే కమెడియన్లు కేవలం ఒకరు ఇద్దరు మాత్రమే ఉండే వాళ్ళు. ఇక వీరు సినిమాలలో కామెడీని పండిస్తున్నారు అంటే హీరోతో సమానంగా పారితోషకం అందుకునే వారు. ఇక అలాంటి వారిలో హీరోలతో సమానంగా పారితోషకం తోపాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్న వారిలో రేలంగి కూడా ఒకరు.The comedian who never failed!రేలంగి వెంకట్రామయ్య గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న రావులపాడు అనే గ్రామంలో రామదాసు, అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించిన ఈయన తండ్రి దగ్గర నుంచి హరికథ , సంగీతం నేర్చుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేయడం ప్రారంభించిన ఈయన 1935 లో కృష్ణ తులాభారం అనే చిత్రం ద్వారా దర్శకుడు సి.పుల్లయ్య సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అక్కడ పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోకపోయినా 1948లో వచ్చిన వింధ్యరాణి అనే సినిమా ద్వారా తన కెరియర్ విజయాల బాట పట్టింది.relangi - Twitter Search / Twitterఇక తర్వాత కీలుగుర్రం, పాతాళభైరవి , పెద్దమనుషులు, గుణసుందరి కథ , మాయాబజార్, మిస్సమ్మ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి సుమారుగా నాలుగు దశాబ్దాలపాటు 300 చిత్రాలకు పైగా నటించాడు. నటుడిగా తారా స్థాయిని అందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఇక 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.. సినీ ఇండస్ట్రీలోనే పద్మ శ్రీ అందుకున్న మొట్టమొదటి హాస్యనటుడిగా ఈయన రికార్డుల్లోకి ఎక్కారు. చివరి దశలో అనారోగ్యంతో మరణించిన రేలంగి .. ఈయన సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news