పట్టుదల, పౌరుషానికి మారు పేరు తెలంగాణ: ప్రధాని మోడీ

-

పట్టుదల, పౌరుషానికి మారు పేరు తెలంగాణ అని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేదే బీజేపీ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను తరిమేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పోరాటం చేస్తామన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడు.. నేడూ ఉన్నారని, అమర వీరుల త్యాగాలు ఒక్క కుటుంబానికే పరిమితమైందన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణ ఉజ్వల భవిష్యత్‌ కోసం అమరవీరులు తమ ప్రాణాలు అర్పించారన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు పోరాడాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోందన్నరు. మీ అభిమానమే.. నా బలమని ప్రధాని మోడీ తెలిపారు.  టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోందన్నారు. కాగా, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని.. ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 930 మంది హాజరు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news