కరోనా కారణంగా ఎంతమంది ఎక్కడెక్కడ చిక్కుకుపోయారో వాస్తవంగా చెప్పడం కష్టంగా మారింది. ఎవరో ఒకరి సమాచారం ఇస్తేగాని అలా చిక్కుకున్న వాళ్ళ గురించి తెలిసి ఎవరో ఒకరు ముందడుగు వేసి వాళ్ళ సొంత ఊళ్ళకి తరలిస్తున్నారు. వాళ్ళకోసం ప్రత్యేకంగా బస్ లను వేసి వలస కార్మీకులని వాళ్ళ ఇళ్ళకి చేరవేస్తున్నారు. రీసెంట్ గా మంచు మనోజ్ ఇలా చాలా మందిని బసులను ఏరాటు చేసి సొంత ఊళ్ళకి తరలించారు.
ఇక టాలీవుడ్ బాలీవుడ్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న సోనూ సూద్ ఇప్పటికే వందల సంఖ్యలో వాహనాలు పెట్టి వలస కార్మికులను స్వస్థాలకు చేరేలా చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం సంచలనం అవుతోంది. కేరళలో చిక్కుకుపోయిన 177 మంది వలస కార్మికుల కోసం ఏకంగా ఓ చార్టెడ్ విమానం ఏర్పాడు చేశారు సోనూ సూద్. లాక్‌డౌన్ కారణంగా కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో ఇరుక్కుపోయిన మహిళా కార్మికుల కోసం ఈ ఏర్పాటు చేశారు. వారిని ఒడిశాకు ఈ చార్టెడ్ ఫ్లైట్‌లో తరలించనున్నారు.
177 మంది మహిళా కార్మికులు, కొచిలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. స్టిచింగ్, ఎంబ్రాయిడరీ పని చేస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా కంపెనీ మూసివేశారు. దాంతో జీవనం కష్టంగా గా మారింది. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ వారిని స్వరాష్ట్రానికి తరలించేందుకు తన టీంతో కలిసి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. వీరిని తరలించేందుకు చార్టెడ్ విమానాన్ని ఎంచుకున్నారు. సోనూ సూద తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి సౌత్ అండ్ నార్త్ నుండి సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకుల దగ్గర్నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మొత్తానికి రీల్ లైఫ్ లో విలన్ అయినప్పటికి రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నాడు. అంతేకాదు వలస కార్మీకుల పట్ల దేవుడయ్యాడు.