24 కిస్సెస్.. హెబ్భా ఘాటు ముద్దులు

-

కుమార్ 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన హెబ్భా పటేల్ ఆ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకునేలా సినిమాలు చేయలేదు. లేటెస్ట్ గా హెబ్భా పటేల్ అరుణ్ ఆదిత్ కలిసి చేస్తున్న సినిమాతో మరోసారి రెచ్చిపోయింది. 24 కిస్సెస్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ముద్దుల హంగామాతో హెబ్భా పటేల్ ప్రేక్షకులను అలరిస్తుంది.

అయోధ్యా కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈమధ్యనే వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించగా లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదిత్ బిగి కౌగిలిలో హెబ్భా ఇచ్చిన అదరచుంభనం అబ్బో.. అబ్బో.. అబ్బబ్బో అనేలా ఉంది. కుమారి తర్వాత హెబ్భాకి సరైన సినిమా ఇదే అంటున్నారు పోస్టర్స్ చూసిన ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Latest news